YSRCP vs Janasena: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పుడు ఒంగోలులో వైసీపీకి భారీ షాక్ తగలబోతోంది.. వైసీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీలో చేరగా.. బాలినేని ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరరేందుకు సిద్ధమయ్యారు వైసీపీ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు.. పవన్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో- ఆప్షన్ సభ్యులు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.. గత కొద్దికాలంగా జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్ల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. అయితే, పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం పలుసార్లు వాయిదా పడిందని నేతలు చెబుతున్నారు..
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు..
గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీలో ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచారు పలువురు వైసీపీ నేతలు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేన పార్టీలో చేరడంతో.. ఆయన వెంటనే నడుస్తామని ప్రకటించారు వైసీపీ కార్పొరేటర్లు.. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను తమ చేతుల్లోకి తీసుకుంది టీడీపీ.. తాజాగా, 23 మంది సభ్యులు జనసేనలో చేరితే ఒంగోలు కార్పొరేషన్ రాజకీయం మారతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా, వైసీపీ కార్పొరేటర్లు జనసేన వైపు చూసినా.. వారిని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి.. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి షాక్ ఇస్తూ.. ఈ రోజు జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు ఒంగోలు కార్పొరేటర్లు..