Site icon NTV Telugu

King Charles: కింగ్‌ చార్లెస్‌పై కోడిగుడ్లతో దాడి.. యువకుడు అరెస్ట్

King Charles

King Charles

King Charles: లండన్‌లోని యార్క్ నగరాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై దుండ‌గులు కోడిగుడ్లు విసిరారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కింగ్‌ చార్లెస్ నడుస్తున్న సమయంలో గుడ్లు విసిరినట్లు ఆరోపణలు రావడంతో.. 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు తెలిపారు. ఉత్తర ఇంగ్లండ్‌లోని యార్క్‌ను సందర్శించినప్పుడు చక్రవర్తి తన దిశలో గుడ్లు కొట్టడాన్ని తృటిలో తప్పించుకున్న ఒక నెలలోపే లండన్‌కు ఉత్తరాన ఉన్న లుటన్‌లో దుండగుడిని అరెస్టు చేశారు.

కింగ్ చార్లెస్ కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలను కలవడానికి, కొత్త సిక్కు ఆలయాన్ని తెరవడానికి, కొత్త ప్రజా రవాణా వ్యవస్థను సందర్శించడానికి లూటన్‌లో ఉన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని లూటన్ టౌన్ హాల్ వెలుపల అదుపులోకి తీసుకుని విచారణ కోసం తీసుకెళ్లినట్లు బెడ్‌ఫోర్డ్‌షైర్ పోలీసులు తెలిపారు. నవంబర్ 9న యార్క్‌లో గుడ్లు విసురుతున్నప్పుడు ఆ వ్యక్తి “ఈ దేశం బానిసల రక్తంతో నిర్మించబడింది.. నా రాజు కాదు ” అని గ‌ట్టిగా అరిచాడు. అనంతరం కింగ్ చార్లెస్, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాపై గుడ్లు విసిరాడు. అయితే అక్కడ ఉన్న ప్రజ‌లు మాత్రం “గాడ్ సేవ్ ది కింగ్” అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. అనంతరం గుడ్లు పడిన ప్రాంతం నుంచే కింగ్ చార్లెస్ నడుచుకుంటూ వెళ్లారు. నవంబర్‌ 9న చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ II విగ్రహాన్ని ఆవిష్కరించడానికి చార్లెస్, కెమిల్లా యార్క్ నగరానికి చేరుకున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

Delhi Civic Polls Results: ఢిల్లీ కార్పొరేషన్‌ ఫలితాలు నేడే.. బీజేపీ, ఆప్‌లలో తీవ్ర ఉత్కంఠ

సెప్టెంబర్‌లో కింగ్ చార్లెస్ తల్లి క్వీన్ ఎలిజబెత్ II ప్రాణాలు కోల్పోయారు. 10 రోజుల జాతీయ సంతాపం అనంతరం ఖననం చేశారు. కానీ వంశపారంపర్య సూత్రానికి వ్యతిరేకంగా కొన్ని నిరసనలు జరగగా.. ఈ నేపథ్యంలోనే కింగ్ చార్లెస్ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ గత వారం జాత్యహంకారానికి సంబంధించిన తాజా ఆరోపణలను ఎదుర్కొంది. ఒక నల్లజాతి బ్రిటీష్ ఛారిటీ వర్కర్‌ను ఆమె ఎక్కడి నుంచి వచ్చింగని న్యాయస్థానం పదే పదే ప్రశ్నించిన అనంతరం నిరసనలు జరిగాయి.

Exit mobile version