Site icon NTV Telugu

Worlds Shortest Man: ప్రపంచంలోనే పొట్టి మనిషి.. అతడి హైట్ ఎంతో తెలుసా

Worlds Shortest Man

Worlds Shortest Man

Worlds Shortest Man: పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది. 20 ఏళ్ల అఫ్షిన్ ఎస్మాయిల్ ఘదెర్జాదేహ్‌ కుర్దిష్ నగరమైన బుకాన్‌కు చెందినవాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లో దుబాయ్‌లో 24 గంటల వ్యవధిలో గదర్‌జాదేను మూడుసార్లు కొలిచినట్లు పేర్కొంది. అతడి కంటే ముందు రికార్డ్ హోల్డర్ 36 ఏళ్ల ఎడ్వర్డ్ ‘నినో’ హెర్నాండెజ్ (కొలంబియా) కంటే దాదాపు 7 సెం.మీ (2.7 అంగుళాలు) తక్కువ అని అధికారులు తెలిపారు.

Read Also: Crime News: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. చిన్నారిపై లైంగిక దాడి, హత్య

ఘదెర్జాదేహ్‌ తల్లిదండ్రులు అతనితో కలిసి దుబాయ్ వెళ్లారు. ఘదెర్జాదేహ్‌ తండ్రి మాట్లాడుతూ తన కొడుకుకు మానసిక సమస్యలు లేవని తెలిపారు. తన కొడుకు శారీరక బలహీనత కారణంగానే చదువు మానేసినట్లు సమాచారం. చదువు లేనప్పటికీ కానీ అతని పేరు ఎలా వ్రాయాలో నేర్చుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి సుల్తాన్ కోసెన్ కూడా కుర్దుడే. అతను ఆగ్నేయ టర్కీ (బాకూర్)లోని మార్డిన్ ప్రావిన్స్‌లోని కుర్దిష్ ప్రావిన్స్‌కు చెందినవాడు.

Exit mobile version