Malaysia: బ్రోకర్ మాట నమ్మి విమానం ఎక్కారు.. మలేషియాలో ఖమ్మం వాసుల అవస్థలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaysia: బ్రోకర్ మాటలు నమ్మి మోసపోయారు ఖమ్మం జిల్లా వాసులు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన 20 మందిని విడతల వారీగా మలేషియా తీసుకెళ్లాడు బ్రోకర్ నాగబాబు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన నాగబాబు … మధిర నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామానికి చెందినవారిని మోసగించాడు. ఒక్కొక్కరి నుంచి రెండు, మూడు లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి టూరిస్ట్ వీసాలు ఇప్పించాడు. అవే వర్క్ పర్మిట్ వీసాలుగా భావించి మలేషియా వెళ్లారు. ఇలా వెళ్లినవారంతా నిరుపేదలే. ఇందులో 11 మంది మహిళలూ ఉన్నారు. వేలల్లో జీతం అనేసరికి సంబరపడి మలేషియా వెళ్లారు. మలేషియాలో ఓ కంపెనీలో పనికి కుదిర్చాడు ఏజెంట్. 8 నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. వర్క్ పర్మిట్ వీసా లేకపోవడంతో పనిలో నుంచి తీసేసింది మలేషియా కంపెనీ. అదేమని బ్రోకర్‌ను ప్రశ్నిద్ధామంటే అతని ఫోన్ స్విచాఫ్ చేసేశాడు.
మలేషియాలో ఉపాధి లేక, స్వదేశం వచ్చేందుకు చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇంతలోనే బాధితులను మలేషియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తమ వారిని విడిపించి స్వదేశం తీసుకురావాలని వేడుకుంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. రెండు నెలలుగా తమకు ఫోన్లు రావట్లేదని, తమ వారి యోగక్షేమాలు తెలియట్లేదని వాపోతున్నారు. మలేషియాలో నాయుడు వీళ్లతో పని చేయించుకున్నాడు కానీ డబ్బులు ఇచ్చింది లేదు. ఇప్పుడు స్వదేశం వచ్చేద్దామంటే వీసా సమస్య ఉంది. మలేషియా నుంచి బాధితులు బయటపడాలంటే..ఫైన్ కట్టాల్సిందే. ఇప్పటికీ చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నామని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రాజుపాలెంలో బాధిత కుటుంబాల్లోని చిన్నారులు, వృద్ధులు…తమ వాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమే తమ వాళ్లను విడిపించి తీసుకురావాలని కోరుతున్నారు.
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..