NTV Telugu Site icon

Boy Falls Into Borewell: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు.. 9 గంటలు శ్రమించి బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్‌!

Borewell

Borewell

2 Year Old Boy Falls Into Borewell In Gujarat: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్‌ దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చింది. ఈ ఘటన గుజరాత్‌ జామ్‌నగర్‌లోని గోవానా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాలుడుని వెంటనే చికిత్స కోసం జామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి…

గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఓ రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ (ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) రంగంలోకి దిగాయి. మంగళవారం రాత్రి 7 గంటలకు సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్స్.. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బాలుడిని బయటకు తీసుకొచ్చాయి. బాలుడు బతికే ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Also Read: MS Dhoni: క్యూ లైన్‌లో నిల్చొని మరీ.. అమ్మవారిని దర్శించుకున్న ఎంఎస్ ధోనీ! వీడియో వైరల్

చికిత్స నిమిత్తం బాలుడుని వెంటనే జామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అగ్నిమాపక శాఖ నుంచి రెండు బృందాలు.. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు పాల్గొన్నట్లు ఐ అధికారి పేర్కొన్నారు. దాదాపు 9 గంటలపాటు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకొచ్చామని చెప్పారు. గత జనవరిలో గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలికను రెస్క్యూ టీమ్స్ రక్షించినా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది.

Show comments