Site icon NTV Telugu

Venkatesh Iyer: ఇంగ్లాండ్‌లో అదరగొట్టిన ఐపీఎల్ స్టార్ క్రికెటర్..

Venkatesh

Venkatesh

కోల్కతా నైట్రైడర్స్ స్టార్ ఆల్రౌండర్, భారత క్రికెటర్ ఇంగ్లండ్‌లో అదరగొట్టాడు. తన బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. వెంకటేష్ అయ్యర్ లన్షైర్ తరపున వన్డే గేమ్ ఆడుతున్నాడు. దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌లో అయ్యర్ తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి జట్టు గెలవాలంటే 8 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉంది. అయితే.. తన జట్టు సభ్యులంతా మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు. కానీ వెంకటేష్ అయ్యర్ మ్యాజిక్ చేశాడు. తాను వేసిన 49వ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి వోర్సెస్టర్‌షైర్ జట్టును 3 పరుగుల తేడాతో ఆలౌట్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.

Russia: డ్యాన్సర్‌కు రష్యా కఠిన శిక్ష.. ఉక్రెయిన్‌కు విరాళం ఇచ్చినందుకు 12 ఏళ్లు జైలు

ఇంగ్లండ్ వేదికగా దేశవాళీ వన్డే కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 14న లన్షైర్-వోర్సెస్టర్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వోర్సెస్టర్ చివరి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి 5 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చిన వెంకటేష్ అయ్యర్‌కి 49వ ఓవర్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తన అద్భుత బౌలింగ్ తో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

August 15: ఆగస్టు 15 భారత్‌కి మాత్రమే కాదు.. ఈ దేశాలకు కూడా ప్రత్యేకమే..

కాగా.. వెంకటేష్ అయ్యర్ వేసిన చివరి ఓవర్లలో ఏ మాత్రం అంచనాలు లేకుండా ఉండేది. వెంటేశ్ వేసిన ఐదో బంతిని షార్ట్ ఆడిన బ్యాట్స్‌మెన్ బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు.. కాని ఔట్ అయ్యాడు. దీంతో.. జట్టుకు కొంత ఊరట లభించింది. ఆ తర్వాతి బంతికే చివరి వికెట్‌ను ఎల్బీడబ్ల్యూ అయింది. దీంతో.. తన అద్భుత బౌలింగ్ తో జట్టును గెలిపించాడు.

Exit mobile version