Two Tigers: తడోబా అంధారి రిజర్వ్‌లో 24 గంటల్లో 2 పులులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Tigers: మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లో వేర్వేరు ప్రదేశాల్లో రెండు పులులు చనిపోయాయని అధికారులు ఇవాళ తెలిపారు. జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడోబా అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని మొహర్లీ పరిధిలోని కంపార్ట్‌మెంట్ 189లో గురువారం ఉదయం ఓ పులి చనిపోయిందని చీఫ్ అటవీ సంరక్షణాధికారి డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్కర్ తెలిపారు. పులిపై మరో పులి దాడి చేసినట్లు గుర్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు 6 నుంచి 7 నెలల వయసు గల పులి పోరాటంలో చనిపోయి ఉండొచ్చన్నారు. పులి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించామన్నారు.
Elephant Attack: గజరాజు ముందు ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. ఆగ్రహంతో ఏం చేసిందంటే..?
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
అంతకుముందు బఫర్ జోన్‌లోని శివని రేంజ్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ పెద్దపులి మృతదేహం కుళ్ళిన స్థితిలో కనుగొనబడిందని ఆయన తెలిపారు.పెద్దపులి వయస్సు 14-15 సంవత్సరాల వరకు ఉంటుందని.. వృద్ధాప్యం కారణంగా మరణించి ఉండవచ్చన్నారు. అన్ని శరీర భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆ పెద్దపులిని దహనం చేసినట్లు తడోబా అంధారి టైగర్ రిజర్వ్ చీఫ్ అటవీ సంరక్షణాధికారి డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్కర్ అన్నారు.
తాజావార్తలు
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!