Helicopter Crash: అలబామాలో కుప్పకూలిన యూఎస్‌ మిలిటరీ హెలికాప్టర్.. ఇద్దరు మృతి

Helicopter Crash

Helicopter Crash

Helicopter Crash: అమెరికా దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని హైవే సమీపంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.టెన్నెస్సీ నేషనల్ గార్డ్‌కు చెందిన ఈ హెలికాప్టర్‌లో శిక్షణ తీసుకుంటుండగా.. హంట్స్‌విల్లే నగరానికి సమీపంలో మధ్యాహ్న సమయంలో కూలిపోయిందని టెన్నెస్సీ నేషనల్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ గార్డ్ అనేది రాష్ట్ర-ఆధారిత సైనిక దళం.

Pak Hikes Fuel Prices: పాక్‌ ప్రజలపై మరో బాంబ్.. లీటరు పెట్రోల్‌ ధర రూ.272

×
×
Ad

ఇద్దరు టెన్నెస్సీ నేషనల్ గార్డ్స్‌మెన్‌లను కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని టెన్నెస్సీ సైనిక దళాల అధిపతి బ్రిగేడియర్ జనరల్ వార్నర్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి కుటుంబాలకు తోడుగా నిలుస్తామని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో ఇతర సర్వీస్ సభ్యులు లేదా పౌరులు ఎవరూ గాయపడలేదని టెన్నెస్సీ నేషనల్ గార్డ్ పేర్కొంది.