Uttar Pradesh: పుట్టిన 7 నెలలకు చిన్నారి కడుపు బాగా ఉబ్బి.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే 7 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడికి ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు. అందరిని అబ్బురపరిచే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఏడు నెలల బాలుడి కడుపులో రెండు కిలోల పిండం అభివృద్ధి చెందింది. బాలుడి కడుపు ఉబ్బరం చూసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడికి శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించారు.
Also Read: Tomato Prices: టమాటా ధరలపై కూరగాయల విక్రేత కన్నీళ్లు.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ
పిల్లల కడుపులో ఇలా పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫీటర్ ఇన్ ఫీటూ అంటారని వైద్యులు తెలిపారు. దీనికి చేసే శస్త్రచికిత్స జాగ్రత్తగా చేయకపోతే.. కిడ్నీల నుంచి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతోన్న సమయంలో.. ఓ పిండం పూర్తిగా వృద్ధి చెందకుండా.. వృద్ధి చెందుతోన్న మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుందని.. అందువల్లే ఫీటస్ ఇన్ ఫీటు సమస్య ఏర్పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.
