NTV Telugu Site icon

Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!

Dead Body

Dead Body

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్, రమేష్ ఇద్దరు స్నేహితులు. ఈ ఇద్దరు పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులానే బుధవారం పని ముగుంచుకుని.. అడ్డగుంటపల్లిలోని నంబర్ వన్ కల్లు డిపోలో ఇద్దరు పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం
నవీన్, రమేష్ నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఆర్యవైశ్య నగర్ రాగానే రమేష్ కుప్పకూలాడు. దాంతో నవీన్ కంగారుపడ్డాడు. రమేష్‌ను ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నవీన్ ప్రయత్నించాడు. అంతలోనే నవీన్ కూడా కిందపడిపోయాడు.

Also Read: Hanu Man: హీరో తేజ సజ్జాను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!

నవీన్, రమేష్‌లను చుట్టుపక్కల వారు గమనించి గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దాంతో నవీన్, రమేష్‌ కుటుంబంలో విషాద షాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.