దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బురారీ ఆస్పత్రికి, సంజయ్ గాంధీ ఆస్పత్రికి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేపట్టింది. కొద్ది రోజుల క్రితమే స్కూల్స్‌కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆస్పత్రులకు బెదిరింపు కాల్స్ రావడంతో తనిఖీలు చేపట్టారు. రెండు ఆస్పత్రుల దగ్గర సోదాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sandeshkhali: బెంగాల్ సందేశ్‌ఖాలీలో టెన్షన్.. తృణమూల్ ఎమ్మెల్యే సహాయకుడిపై దాడి..
ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ.. డివైజ్‌లు గానీ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు ఢిల్లీలోని బురారి ఆస్పత్రికి తొలుత బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. అనంతరం సాయంత్రం 4:26 గంటలకు సంజయ్ గాంధీ ఆస్పత్రికి రెండో బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఇది కూడా చదవండి: PoK: ఆక్రమిత కాశ్మీర్‌పై పాకిస్తాన్ పట్టుకోల్పోతోందా..? భారత జెండాలు, ఆజాదీ నినాదాలతో ప్రజా ఉద్యమం..
గత వారం ఢిల్లీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేపట్టి అవి బూటకమని తేల్చారు. మే 2న ఢిల్లీలోని 131, గురుగ్రామ్‌లోని ఐదు, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని మూడు పాఠశాలలకు ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు పంపారు.
ఇది కూడా చదవండి: Romances on a Bike: బైక్‌పై రొమాన్స్ చేస్తూ ఎస్పీకి పట్టుబడ్డ జంట.. వీడియో వైరల్..
