NTV Telugu Site icon

Crude Bomb Blast: బంతి అనుకుని బాంబుతో ఆడేందుకు యత్నం.. ఇద్దరు పిల్లలకు గాయాలు

Bomb Blast

Bomb Blast

2 Children In Bengal Pick Up Crude Bomb Mistaking It For Ball, Injured: పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం జరిగిన ముడిబాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ పిల్లలు దానిని బంతి అని తప్పుగా భావించి ముడిబాంబును రోడ్డు పక్కన నుంచి తీయడంతో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో గాయపడిన పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో భాంగోర్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

“ఇద్దరు పిల్లలు ముడి బాంబును బంతి అని తప్పుగా భావించారు, వారిలో ఒకరు దానిని తాకడంతో అది పేలింది. ఇంకా ఏవైనా బాంబులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి భద్రతా దళాలను ఆ ప్రాంతానికి పంపాం” అని ఒక అధికారి తెలిపారు. 8 నుంచి 10 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు చిన్నారులను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.

Also Read: Viral Video: స్పెయిన్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న కార్లు, వాటిపై జనాలు.. వీడియో వైరల్

ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు రాత్రిపూట క్రూడ్ బాంబులను విచక్షణారహితంగా ప్రయోగించారని, పోలీసులెవరూ కనిపించడం లేదని ఆరోపిస్తూ స్థానికులు ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నీలంజన్ శాండిల్య మాట్లాడుతూ.. సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. కోల్‌కతాకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో పోలింగ్ రోజున అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. జూన్ 15న నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.