NTV Telugu Site icon

Crime News: దారుణం.. మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు అత్యాచారం

Harassment

Harassment

Crime News: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరినీ వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. మానస్థితి స్థితి సరిగా లేని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ దారుణ ఘటన దేశ వాణిజ్య నగరమైన నవీ ముంబైలో చోటు చేసుకుంది.

Female Guise: ట్రెండ్‌ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు

నవీ ముంబైలో మానసిక స్థితి సరిగా లేని యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు నిందితులు జనవరి 25న డిఘేలోని ఈశ్వర్ నగర్‌కు చెందిన బాలికను అపహరించి, ఫ్యాక్టరీ సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశారని తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టి వారిద్దరు పారిపోయారన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Show comments