Sidhu Moose Wala: పంజాబ్ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidhu Moose Wala: పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు. గత ఏడాది గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఇద్దరికీ సంబంధం ఉందని వారు తెలిపారు. వారు ఇతర కేసులు కూడా ఎదుర్కొంటున్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడని తెలిపారు. ముగ్గురూ ఒకే వర్గానికి చెందినవారు అని చౌహాన్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌ల మధ్య తరన్ తరణ్ జిల్లాలోని జైలులో ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. గ్యాంగ్‌స్టర్స్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్లు మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్ మృతి చెందగా.. మరో గ్యాంగ్‌స్టర్ కేశవ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్‌లోని తరణ్ జైలులో ఉన్న నిందితుల మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తిందనేది గమనార్హం.
Also Read
Read Also: Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ మే 29న మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. మూసేవాలాను హత్య చేసిన కేసులో నిందితులైన మన్‌దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. జైలులో గ్యాంగ్ వార్ జరగడంతో ఇద్దరు నిందితులు చనిపోగా, తీవ్రంగా గాయపడిన కేశవ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!