Site icon NTV Telugu

TTD: హాట్‌ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి

Ttd

Ttd

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక, ప్రత్యేక రోజుల్లో అయితే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అదే వైకుంఠ ద్వారా దర్శనం అయితే.. తిరుమల గిరులు అన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి.. ఏడు కొండలు గోవందనామస్మరణతో మార్మోగుతాయి.. ఇప్పటికే వైకుంఠద్వారా దర్శనం షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేయగా.. ఈ రోజు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టింది.. అయితే, హాట్‌ కేకుళ్లా.. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం..

Read Also: Komatireddy Rajgopalreddy: పరుగులు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వీడియో వైరల్

డిసెంబర్‌ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆ సమయంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు ప్రత్యేకంగా 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈ రోజు ఆన్‌లైన్‌లో పెట్టింది.. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తించనుండగా.. రోజుకి 22,500 టికెట్ల చొప్పున మొత్తం 2.25 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.. అయితే, హట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విక్రయం అయ్యాయి.. టికెట్లు విడుదల చేసిన 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్లు విక్రయాలు పూర్తి కాగా.. 16 నిమిషాల వ్యవధిలోనే 2 లక్షల టికెట్లు.. 17 నిమిషాల నిముషాల వ్యవధిలోనే 90 శాతం టికెట్ల విక్రయాలు పూర్తి కాగా.. 21 నిమిషాల వ్యవధిలో పూర్తిస్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.. వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 6.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

Exit mobile version