NTV Telugu Site icon

Bijapur: 19 మంది మావోలు లొంగుబాటు.. 9 మందిపై రూ.28 లక్షల రివార్డ్

Naxalites

Naxalites

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 19 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ. 28 లక్షల రివార్డు ఉంది. పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సీనియర్ అధికారుల ముందు వీరు లొంగిపోయారు. వారు తమ మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ చెందడం, సీనియర్ క్యాడర్లు అమాయక గిరిజనులను దోపిడీ చేయడం, నిషేధిత సంస్థలో పెరుగుతున్న విభేదాల కారణంగా వారు లొంగిపోయినట్లు చెప్పారు. కాగా.. ఈ విషయాన్ని బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ ఆంధ్ర ఒడిశా బోర్డర్ (AOB) డివిజన్, మావోయిస్టుల పామెడ్ ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో ఉన్నారని యాదవ్ పేర్కొన్నారు.

Read Also: Ashwini Vaishnav: ఇండియాలో రైల్వే ఛార్జీలు పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువ..

లొంగిపోయిన నక్సలైట్లలో దేవ పదం (30), అతని భార్య దులే కలాము (28) మావోయిస్టు బెటాలియన్ నంబర్ 1లో సీనియర్ సభ్యులుగా ఉంది. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. ఇక, ఏరియా కమిటీ సభ్యుడు సురేష్ కట్టం (21) తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. అలాగే లొంగిపోయిన నక్సలైట్లలో ఒక్కో తలపై రూ. 2 లక్షల రివార్డు ఉండగా, ఐదుగురు నక్సలైట్ల తలపై ఒక్కొక్కరికి రూ. 1 లక్ష రివార్డు ఉంది.

Read Also: Tollywood: హీరోలు అందరూ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా?

కాగా.. నక్సలైట్లు లొంగిపోవడంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CRPF, COBRA (కమాండో బెటాలియన్ ఫర్ రిసల్యూట్ యాక్షన్) కీలక పాత్ర పోషించాయని జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన ప్రతి నక్సలైటుకూ రూ. 25,000 సహాయం అందించామని అన్నారు. వారికి పునరావాసం కల్పిస్తామని జితేంద్ర కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు బస్తర్ రేంజ్‌లోని బీజాపూర్ జిల్లాలో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారు. గత సంవత్సరం, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాలలో మొత్తం 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు.