NTV Telugu Site icon

Tirumala: డిసెంబర్‌లో 19.16 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం..

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉంటారు.. కొన్ని సందర్భాల్లో తిరుమల గిరులు భక్తులతో రద్దీగా మారతాయి.. ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే వారిని కట్టడి చేయడం కూడా కష్టమే అనే తహారలో భక్తులు రద్దీ కనిపిస్తోంది. అయితే, రద్దీ కట్టడికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, డిసెంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 19.16 లక్షలు ఉందని టీటీడీ ప్రకటించింది. డిసెంబర్‌ నెలలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.116.7 కోట్ల ఆదాయం వచ్చింది.. కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది.. 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.. 6.87 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ తెలిపింది..

Read Also: Dilbag Singh: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు, మద్యం, విదేశీ ఆయుధాలు లభ్యం

ఇక, తిరుమనలో ఈ నెల 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామన్నారు. మరోవైపు.. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి 15వ తేదీన తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.