Mahalaxmi Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పల్లెవెలుగు, ఎక్సెప్రెస్ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో 182 మంది మహిళలతో వెళ్తున్న రూరల్ బస్సు టైర్ల నుంచి పొగలు రావడంతో ఆగిపోయింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 06 యూపీ 3411) బుధవారం ఉదయం మహబూబ్ నగర్ నుంచి 182 మంది ప్రయాణికులతో నారాయణపేటకు బయలుదేరింది.
Read Also: Big Breaking: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వారికి గన్ మెన్లు తొలగింపు..
జేపీఎన్ సీఈ ఇంజినీరింగ్ కాలేజీలో దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులు దిగారు. అనంతరం మరికొందరు మహిళలు వేదికపైకి వచ్చారు. దీంతో బస్సు ఓవర్ లోడ్ అయి మరికల్ వద్దకు వెళ్లిన తర్వాత వెనుక టైరు నుంచి పొగలు రావడం మొదలైంది. ఓవరలోడ్ కారణంగా ధన్వాడ చేరుకోగానే పొగ ఎక్కవై కాలిన వాసన వచ్చింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరినీ అక్కడే దించి ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.