TS Covid-19: రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న కూడా కేసులు పదుల సంఖ్యలో నమోదు కాగా.. దీంతో కోవిడ్ కేసులు రాష్ట్రంలో 100 కు చేరువలో ఉండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. హైద్రాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని, మేజర్ గా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు వైద్యులు కోవిడ్ భారిన పడ్డారని అన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదు అంటున్న వైద్యులు సూచిస్తున్నారు.
Read also: Health Tips : పాలల్లో ఈ రెండు కలిపి తాగితే చాలు.. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలో..
ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లేదంటే 2021, 22 లో ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రిపీట్ అవుతాయని పేర్కొన్నారు. న్యూయర్ వేడుకల్లో ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండకూదని సూచించారు. కోవిడ్ ను ప్రజలకు చాలా తేలికగా తీసుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తుందని.. విదేశాల నుంచి వచ్చే బంధువులైనా, కుటుంబ సభ్యులైనా సరే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోవిడ్ నిర్ధారణ తీసుకుని ఆ తరువాత ఇంట్లోకి అనుమతించాలని తెలిపారు. పిల్లల పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని, కోల్డ్, జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ముందుగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, బయట మెడికల్ షాప్ లో ఏవైనా మందులు తీసుకుని వేసుకోవద్దని సూచించారు.
Read also: Tollywood: మీ చుట్టూ సోషల్ మీడియా తిరగాలి కానీ.. మీరు తిరిగితే ఎలా?
దేశంలో 797 కొత్త కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా మరో ఐదుగురు మరణించారు. అలాగే, కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ అయిన JN1 కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జేఎన్1 వేరియంట్ కేసుల సంఖ్య 157కు చేరుకుందని కేంద్రం వెల్లడించింది. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నాయి. ఇది ఏ రకమైన కరోనా వేరియంట్ అని నిర్ధారించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కొన్ని నమూనాలు కూడా పంపబడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, కొత్త కేసులతో పాటు, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4091 కి చేరుకుంది. కరోనాతో మరణించిన ఐదుగురిలో ఇద్దరు కేరళకు చెందిన వారని, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని పేర్కొంది. ఈ మరణాలతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుందని తెలిపారు.
Karnataka : టెన్త్ స్టూడెంట్ తో ప్రిన్సిపల్ రొమాంటిక్ ఫోటో షూట్.. దుమ్మెత్తిపోస్తున్న జనం