ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గరద్‌పూర్ బ్లాక్‌లోని కుదనగారి హైస్కూల్ పై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. అందులో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడ్డ వారు అమృత పాండా, అద్యాషా లక్ష్మి సమల్‌గా గుర్తించారు.
Also Read : Ankita Lokhande: తండ్రి పాడె మోసిన నటి.. వీడియో వైరల్
వారిని వెంటనే చిక్సిత కోసం పాటకురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేంద్రపరా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుకు గురైన విద్యార్థులు.. కుదనగారి ఆదర్శ విద్యాలయంలోని 6వ తరగతి చదువుతున్నారు. గాయపడిన 16 మంది విద్యార్థుల్లో 14 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
Eiffel Tower: ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
పిడుగుపాటుకు గురైన అనంతరం.. కొంతమంది విద్యార్థులు స్పృహ కోల్పోయారు. మరికొందరు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు పిడుగుపాటు వల్ల తమ తరగతి గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని విద్యార్ధులు చెప్పారు. ఈ ప్రమాదంపై పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.
