కొత్తూరు మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి
కుటుంబంలో విషాదం నెలకొంది. కొత్తూరు మునిసిపాలిటీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్ చోబె దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు. ధర్మేందర్ చోబె దంపతులు వస్త్ర కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం
కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే వున్న బకెట్‌లో పడింది. బకెట్
నిండా నీళ్లు ఉండడంతో అందులో మునిగిపోయింది. అయితే కొద్ది సేపటి తరువాత తల్లిదండ్రులు వెతికిన కనిపించకపోవడంతో ఇళ్లంతా
వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో బయటకు వచ్చి చూడగా షాక్ తిన్నారు. చిన్నరి నీటి బకెట్ లో విగత జీవిగా పడివుంది.
ఇదిలా ఉంటే.. విద్యుత్ తీగలు తగిలి ఓ బాలుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లక్ష్మీవాణి టవర్స్‌పై గాలిపటాలు ఎగురవేస్తున్న చిన్నారులు. వీరితో పాటు మహారాష్ట్రకు చెందిన 11 ఏళ్ల తనిష్క్ కూడా గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.