J-K: భారత్‌పై కుట్రకు పాకిస్థాన్ భారీ ప్లాన్..150 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..
- భారత్‌పై కుట్రకు పాక్ భారీ ప్లాన్
- 150 మందికి పైగా ఉగ్రవాదులు భారత్‌లో చొరబాటుకు యత్నం
- తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది
- ఇప్పటికే తగి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైనట్లు అధికారి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌తో సహా భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి షాకింగ్ సమాచారం ఇచ్చారు. దాదాపు 150 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (కశ్మీర్ ఫ్రాంటియర్) అశోక్ యాదవ్ చెప్పారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో 150 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి లాంచ్ ప్యాడ్ వద్ద భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సరిహద్దు భద్రతా దళం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, అలాంటి ప్రయత్నాలను విఫలం చేస్తామన్నారు.
READ MORE: Vishwambhara : మెగా ఫాన్స్ కి దసరా బొనాంజా.. గెట్ రెడీ
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సరిహద్దుల్లోని లాంచ్ప్యాడ్పై ఉగ్రవాదులు..
శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో లోయలోకి చొరబడేందుకు దాదాపు 150 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి లాంచ్ప్యాడ్లపై కూర్చున్నట్లు సమాచారం. అయితే భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అంశంపై శుక్రవారం బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (కశ్మీర్ ఫ్రాంటియర్) అశోక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. వివిధ ఏజెన్సీల నుంచి తమకు అందుతున్న నిఘా ఆధారంగా, సరిహద్దులో బలమైన వ్యూహాన్ని ఏర్పాటు చేయడానికి సైన్యంతో సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్‌లోని ఉగ్రవాదులను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. తమకు ఓ ప్రత్యేక వ్యూహం ఉందని.. ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
READ MORE:Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కీలక పరిణామం..
‘మొబైల్ బంకర్లు, మహిళా సైనికులు కూడా మోహరించారు’
నియంత్రణ రేఖ వెంబడి కొన్ని గ్రామాలు, తంగ్ధర్, కెరాన్ సెక్టార్ల వంటి కొన్ని సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొంతమంది మహిళలను కొరియర్లుగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున భద్రతా బలగాలు మొబైల్ బంకర్లను, మహిళా సైనికులను కూడా మోహరించారు. ఆయుధ నిర్వహణ, కాల్పులు, ఫీల్డ్ క్రాఫ్ట్, వ్యూహాలు, ఓర్పు కార్యకలాపాలు వంటి సరిహద్దు నిర్వహణ యొక్క సాంప్రదాయిక అంశాలలో మాత్రమే కాకుండా.. తాజా సాంకేతికతలో కూడా సైనికులకు శిక్షణ ఉండేలా దళం కృషి చేస్తుందని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!