NTV Telugu Site icon

Bhadradri Kothagudem: అధికారుల నిర్లక్ష్యం..వరదల్లో చిక్కుకున్న 15మంది కూలీలు

Bhadradri Kothagudem

Bhadradri Kothagudem

అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు దూసుకుపోతోంది. వరద ప్రవాహంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని రుద్రమకోట గ్రామానికి చెందిన కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటంతో సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్ ను సిద్ధం చేశారు ఏపీ అధికారులు.

READ MORE: Karnataka High Court: ‘‘చైల్డ్ పోర్నోగ్రఫీ’’ చూడటం నేరం కాదు..

భద్రాద్రి అశ్వరావుపేట మండలం అనంతరం గ్రామంలో కేసీఆర్ కాలనీని వరద నీరు ముంచేసింది. గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వరద నీరు గ్రామం చుట్టూ చేరుకోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలు ఊళ్లోంచి కాళీ చేసి బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దాని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పీయర్‌ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపు వంగి ఉంది. రుతుపవన ద్రోణి ఈ రోజు కోట, గుణ, కళింగపట్నం మీదుగా వెళ్తూ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. గాలి విచ్చిన్నతి ఈ రోజు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1కి.మీ నుంచి 5.8కి.మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంది.