చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జన్ పలాచ్ స్క్వేర్‌లోని చార్లెస్ యూనివర్సిటీలో చొరబడిన ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ భవనంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో 15 మంది అక్కడిక్కడే మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుపెట్టారు. ఇక, ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
Read Also: Prabhas: నైజాం కింగ్ అని నిరూపిస్తున్నాడు… ఆర్ ఆర్ ఆర్ సేల్స్ కూడా దాటేశాడు
అయితే, యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే వర్సిటీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కాగా, కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం లేదని చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రాకుసన్ వెల్లడించారు. పోలీసుల విచాణరకు సహకరించాలని స్థానికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.