NTV Telugu Site icon

Yerragondapalem: యర్రగొండపాలెంలో టెన్షన్‌ టెన్షన్‌.. 144 సెక్షన్‌ విధింపు..

Yerragondapalem

Yerragondapalem

Yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి.. దీంతో మహిళలు సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మానానికి ఏర్పాట్లు చేయటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణాన్ని మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు.. రాళ్ళ దాడిలో కానిస్టేబుల్ కి తీవ్రగాయలు కావటంతో హాస్పిటల్ కి తరలించారు. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు ధ్వంసం చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు..

Read Also: Vikram: వైవిధ్యంతోనే విక్రమ్ పయనం!

ఇక, యర్రగొండపాలెంలో నాలుగు రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి యర్రగొండపాలెం లోని ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకుని ఘర్షణకు దిగారు. దీంతో ఓ కానిస్టేబుల్ సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. స్థానిక పోలేరమ్మ ఆలయానికి ముందు ఆర్చి నిర్మాణాన్ని ప్రారంభించటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్ బాక్సులు మరో వర్గం వారు ధ్వంసం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. రాళ్ళ దాడులు, ముఖ ద్వార నిర్మాణం ప్రారంభించిన ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పరిశీలించారు. మతఘర్షణలు జరగకుండా జిల్లా నుండి ప్రత్యేక బలగాలను రప్పిస్తున్నారు. విషయం తెలుసుకుని ఇరువర్గాలతో మాట్లాడిన మంత్రి సురేష్ సంయమనం పాటించాలని కోరారు. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆర్చి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.