Site icon NTV Telugu

Lightning Strike: పిడుగుల బీభత్సం.. పశ్చిమ బెంగాల్‌లో 14 మంది దుర్మరణం

Lightning

Lightning

Lightning Strike: పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు పుర్బా బర్ధమాన్ జిల్లాలో నలుగురు, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. పశ్చిమ్‌ మిడ్నాపూర్‌, హౌరా రూరల్‌ జిల్లాల్లో మరో ఆరుగురు మరణించారని పశ్చిమ్‌ బెంగాల్‌ పోలీసు అధికారులు తెలిపారు.

Read Also: Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు

వ్యవసాయ పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురైన రైతులే ఎక్కువగా బాధితులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, పుర్బా బర్ధమాన్, ముర్షిదాబాద్ సహా పలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

Exit mobile version