NTV Telugu Site icon

CDSCO: మరోమారు నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు..

Cdsco

Cdsco

CDSCO: కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, 135 మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి. ఈ మందులలో గుండె, షుగర్, కిడ్నీ, రక్తపోటు, యాంటీబయాటిక్స్ వంటి వివిధ వ్యాధులకు వాడే మందులు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మందుల తయారీ కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. ఈ మందులలో ప్రధానంగా షుగర్, మైగ్రేన్ వంటి వ్యాధులకు ఉపయోగించే ఔషధాలు ఉన్నాయి. కేంద్ర ప్రయోగశాలలు 51 మందుల నమూనాలను, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలు 84 మందుల నమూనాలను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధారించాయి. ఈ నిర్ధారణ తరువాత కొన్ని మందుల తయారీదారుల లైసెన్స్‌లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

Also Read: Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి

ప్రధానంగా తక్కువ నాణ్యత గల మందులలో జన్ ఔషధ కేంద్రాలకు సరఫరా చేసే యాంటీబయాటిక్ సెఫ్పోడోక్సైమ్ టాబ్లెట్ (200 ఎంజీ), డైవల్‌ప్రోఎక్స్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్, జింక్ సల్ఫేట్ టాబ్లెట్, పెంటాప్రజోల్, అమోక్సిసిలిన్, బీటాహిస్టైన్ లు ప్రదానంగా ఉన్నాయి. ఇప్పటివరకు 300 మందులు నిషేధానికి గురయ్యాయి. ఈ మందుల్లో 206 ఫిక్స్ డోస్ మందులు కూడా ఉన్నాయి. ఫిక్స్ డోస్ అంటే ఒకే మందులో రెండు లేదా ఎక్కువ మందులను కలిపి తయారు చేసే ఔషధాలు.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం

మందుల నాణ్యత నిర్ధారించడానికి CDSCO పలు దశల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. మొదట మందుల సంబంధించిన డాక్యుమెంట్లు, లేబెలింగ్, ఎక్స్‌పైరీ డేట్లను పరిశీలిస్తారు. ఆపై మందుల భద్రత, ప్రభావాలను అంచనా వేయడానికి ప్రత్యేకమైన సేఫ్టీ పరీక్షలు చేస్తారు. ఇంకా లేబులింగ్ విషయంలో ఎటువంటి తప్పు ఉంటే దానిని సరిదిద్దుతారు.