NTV Telugu Site icon

IND U19 vs PAK U19: ఏంటీ బ్రో.. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్..!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఈ కుర్రాడి పేరు మార్మోగిపోతుంది. ఎందుకంటే.. అతి పిన్న వయస్సులో వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ యువ బ్యాటర్‌లో టాలెంట్‌ను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ (RR) తాజాగా జరిగిన వేలంలో కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్న వైభవ్.. మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

Read Also: Election Commission: మహారాష్ట్ర ఎన్నికల అనుమానాలపై కాంగ్రెస్‌కి ఈసీ ఆహ్వానం..

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 281 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తరుఫున ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్‌కు దిగారు. ఆయుష్ మ్హత్రే నాలుగో ఓవర్ నాలుగో బంతికి ఔటయ్యాడు. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలో.. ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరడంతో వైభవ్ సూర్యవంశీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్ స్కోరు 14 ఓవర్లలో 3 వికెట్లకు 53 పరుగులు చేసింది.

Read Also: Minister Bala Veeranjaneya Swamy: దేశంలోనే అత్యధిక పింఛన్లు ఏపీలోనే.. ప్రభుత్వంపై నింధలు సరికాదు..