Site icon NTV Telugu

Road Accident: రోడ్ టెర్రర్.. ట్రక్కు-మినీ బస్సు ఢీ, 13 మంది దుర్మరణం

Road Accident Pak

Road Accident Pak

కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో కనీసం 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులు శివమొగ్గ వాసులుగా గుర్తించారు. బెళగావి జిల్లా సవదత్తి నుంచి యల్లమ్మ దేవిని దర్శించుకుని తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read Alsoఉ T20 World Cup 2024: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లపై రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్..

శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హవేరి జిల్లా బైడ్గి తాలూకాలోని గుండెనహళ్లి క్రాస్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో.. మినీ బస్సులోని ధ్వంసమైన భాగాల్లో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో మృతదేహాలను బయటకు తీయడానికి అగ్నిమాపక శాఖ, పోలీసు సిబ్బంది నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్‌సభ ఎన్నికలనే నిదర్శనం..

Exit mobile version