NTV Telugu Site icon

Vikrant Massey: జాతీయ అవార్డు కంటే.. ప్రేక్షకుల ఆదరణ గొప్పది!

Vikrant Massey

Vikrant Massey

Vikrant Massey About National Award: చిన్న సినిమాగా విడుదలైన ‘12th ఫెయిల్‌’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపుగా రూ.100 కోట్లు వసూల్ చేసింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే పలు రికార్డులు సాధించిన 12th ఫెయిల్‌.. జాతీయ అవార్డుల బరిలో నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ సినిమా పోటీపడనుంది. హీరో విక్రాంత్‌ మస్సేకు జాతీయ అవార్డు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోతోంది. దానిపై ఆయన స్పందించారు.

తాజాగా విక్రాంత్‌ మస్సే ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ అవార్డు కంటే ప్రేక్షకుల ఆదరణ గొప్పదని పేర్కొన్నారు. ’12th ఫెయిల్‌ చిత్రం జాతీయ అవార్డుల బరిలో నిలవడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. గొప్ప వేదికలపై సినిమాను ప్రదర్శించారు. నా నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. జాతీయ అవార్డు వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డా. ఆవేశం, ది గోట్‌ లైఫ్‌ వంటి చిత్రాల్లో స్టార్‌ల నటన అద్భుతం. వారి సరసన నేను ఉండడం నా అదృష్టం. జాతీయ అవార్డు వస్తుందా? రాదా? అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదు. అవార్డు కంటే ప్రేక్షకుల ఆదరణ గొప్పది’ అని విక్రాంత్‌ అన్నారు.

Also Read: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్

12th ఫెయిల్‌ చిత్రంలో విక్రాంత్‌ మస్సే ప్రధాన పాత్రలో నటించగా.. విధు వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించారు. మనోజ్‌ కుమార్‌ శర్మ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన ఓ యువకుడు ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఈ సినిమా కథ. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ జీవితం ఆధారంగా అనురాగ్‌ పాఠక్‌ రాసిన పుస్తకాన్ని వెండితెరపై ఆవిష్కరించారు.