నేడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అల్లూరి 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నారు. రక్షణ మంత్రితో పాటు, కేంద్ర మంత్రులు సైతం రానున్నారు. క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన అల్లూరి స్మారక ప్రదేశాలను కేంద్ర మంత్రులు ప్రారంభించనున్నారు.
READ MORE: Bandi Sanjay: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీకైనా ప్రధాని పదవిచ్చారా.. కనీసం సీఎం చేశారా?
రాజ్ నాథ్ సింగ్ విశాఖలోని అల్లూరి జన్మస్థలం పద్మనాభమండలం పాండ్రంగిలో అల్లూరి జ్ఞాన మందిరం వర్చువల్ గా ప్రారంభిస్తారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లో అల్లూరి స్నానమాచరించిన మంప కొలనును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అల్లూరి జిల్లా రాజేంద్రపాలెంలో అల్లూరి స్మారక ప్రదేశంలో రాజేంద్రపాలెం పార్కును వర్చువల్ గా ప్రారంభిస్తారు. అల్లూరి సీతారామరాజు చరిత్ర ఉట్టిపడేల అల్లూరి యానిమేషన్ మూవీని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వర్చువల్ ప్రారంభిస్తారు. పాండ్రంగి లో అల్లూరి అమ్మమ్మగారిల్లు వర్చువల్ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ ప్రారంభిస్తారు.
