NTV Telugu Site icon

Boat Tragedy: 16కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

Gujarat

Gujarat

గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: PhonePe: పేటీఎం, గూగుల్ పేని వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన ఫోన్ పే

ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తన అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసుకున్నాడని, వడోదరకు బయలుదేరి వెళ్తున్నట్లు’ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రస్తుతం సహాయ, రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని భావిస్తున్నట్లు ప్రార్థిస్తున్నాము” అని భూపేంద్ర పటేల్ చెప్పారు. మరోవైపు.. ఈ ఘటనపై ప్రధాని మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Read Also: Indigo Flight: అమ్మమ్మ మరణవార్త విన్న పైలట్‌.. ఇండిగో విమానం 3 గంటలు ఆలస్యం

Show comments