NTV Telugu Site icon

Pakistan : కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి

Karachi

Karachi

పాకిస్థాన్ లోని కరాచీలో శుక్రవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. భాద్ ఘర్ లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ లోని సింథ్ ప్రావిన్స్ లోని కరాచీలోని నోరిస్ చౌరింగ్ గీలో రంజాన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read : Degree Certificate issue : నా సర్టిఫికేట్లను పబ్లిక్‌గా చెప్పగలను..మోడీపై కేటీఆర్ ట్వీట్!

అయితే మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ ఘటనపై పాకిస్థాన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. రేషన్ పంపిణీ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని పోలీసులు అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా జనం అదుపు తప్పి.. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది అని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులంతా కూడా మహిళలే ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు.

Also Read : Covid-19: ఈ కొత్త వేరియంట్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి.. మాస్క్‌ తప్పనిసరి

ఫ్యాక్టరీ యాజమాన్యం ఉచిత రేషన్ అందించడం గురించి పోలీసులకు మరియు జిల్లా యంత్రాంగానికి తెలియజేయలేదని, రేషన్, జకాత్ పంపిణీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పాకిస్థాన్ సూపరింటెండెంట్ తెలిపారు. ఫ్యాక్టరీతో సహా 7 మంది మేనేజర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read : IPL 2023: ముంబై ప్లేయర్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు

పాకిస్థాన్ దేశం ఇప్పటికే ఆర్థిక పేదరికంతో సతమతమవుతుంది. ఇటీవలి కాలంలో ఆర్థిక దారిద్ర్యంతో పాకిస్థాన్ పోరాడుతున్నది గమనార్హం. కనీస అవసరాల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇంతకు ముందు కూడా పాకిస్థాన్ నుంచి పిండి, బియ్యం కోసం తొక్కిసలాట జరిగిన వార్తలు వచ్చాయి. కరాచీలో ఉచిత రేషన్ పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments