NTV Telugu Site icon

Mexico Gang Clash: మెక్సికోలో గ్యాంగ్ వార్.. 12 మంది మృతి

Mexico

Mexico

Gang Clash: మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారు. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక, మెక్సికో నగరంలోని నేషనల్ ప్యాలెస్‌లో బుధవారం నాడు జరిగిన ప్రెస్ సమావేశంలో లోపెజ్ ఒబ్రాడోర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై మంగళవారం నాడు విచారణ ప్రారంభమైంది.. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఇప్పటికే దేశ భద్రతా దళాలకు చెందిన నేషనల్ గార్డ్ సైనికులు సంఘటన స్థలనాకి చేరుకున్నారు. ఈ ఘోరమైన ఘర్షణపై అధికారులు తదుపరి విచారణలో మరిన్ని వివరాలను అందజేస్తారని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పారు.

Read Also: Singareni Jobs: సింగరేణి సంస్థలో 485 ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్ విడుదల

ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేంది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఇలాంటి ఘటన జరగడంపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.తొందరలోనే నిందితులను పట్టుకుంటాని అధ్యక్షుడు ఒబ్రాడోర్ చెప్పుకొచ్చారు.