114Year Old Teak Tree : బ్రిటీష్ వాళ్లు నాటిన చెట్టు.. దాని ధర తెలిస్తే షాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
114Year Old Teak Tree : కేరళ రాష్ట్రంలో ఓ టేకు చెట్టు రికార్డు స్థాయి ధర పలికింది. దాదాపు 114ఏళ్ల వయసు గల ఆ చెట్టు వేలంలో రూ.40లక్షల ధరకు చేజిక్కించుకున్నారు. ఈ చెట్టును నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటిష్‌వారు 114 ఏళ్ల క్రితం నాటారని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంది. 1909లో నాటిన చెట్టు ఎండిపోయి, పరిరక్షణ ప్లాట్‌లో దానంతటదే పడిపోవడంతో అటవీ శాఖ సిబ్బంది సేకరించారు. పరిరక్షణ ప్లాట్లలోని టేకు చెట్లు వాటంతట అవే పడిపోయిన తర్వాతే వాటిని సేకరిస్తారని ఆ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
Read Also: Dasara: ఎట్లైతే గట్లయ్యింది… దేశం మొత్తం మన సౌండ్ వినపడాలే…
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ఈ టేకు చెట్టును నెడుంకాయం ఫారెస్ట్ డిపోలో వేలానికి ఉంచారు. బృందావన్ టింబర్స్ యజమాని అజీష్ కుమార్ ఫిబ్రవరి 10న తుది ధర రూ. 39.25 లక్షలకు వేలంలో గెలుచుకున్నారు. 8 క్యూబిక్ మీటర్ల మందం ఉన్న కలపను మూడు ముక్కలుగా వేలం వేశారు. 3 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ప్రధాన ముక్క రూ.23 లక్షలు పలికింది, అదే చెట్టులోని మిగిలిన రెండు ముక్కలు వరుసగా రూ.11 లక్షలు, రూ.5.25 లక్షలకు చేరాయి. నెడుంకాయ డిపో అధికారి షరీఫ్ చెట్టుకు రికార్డు స్థాయిలో ధర లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
Read Also: Akshay Kumar: సాంగ్ లాంచ్ చేస్తూ గిన్నీస్ బుక్ రికార్డ్ క్రియేట్ చేశాడు
నిలంబూరు టేకు అంతర్జాతీయ బ్రాండ్ కలిగిఉంది. ప్రపంచంలో, టేకు తోటల పెంపకం మొదట నిలంబూరులో జరిగింది. మూడు మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఒక ముక్క లభించే అవకాశాలు చాలా అరుదు. కలపను తిరువనంతపురం తరలించేందుకు లారీపై లోడ్ చేసేందుకు అదనంగా రూ.15,000 చెల్లించాల్సి వచ్చింది. రికార్డు ధర పలికిన ఈ అరుదైన చెక్క ముక్కను లోడ్ చేయడానికి చాలా మంది స్థానికులు వచ్చారు.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..