Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క
- నక్కతో పోరాడిన 11ఏళ్ల బాలిక
- ప్రాణాలను ఫణంగా పెట్టి తమ్ముడిని రక్షించుకున్న చిన్నారి
- మరో ఆరుగురిపై దారుణంగా దాడి చేసిన నక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : లక్నోలోని రహీమాబాద్ ప్రాంతంలోని మావైకల గ్రామంలో మంగళవారం ఉదయం ఒక సోదరుడు, సోదరి సహా ఆరుగురిపై నక్క దాడి చేసి గాయపరిచింది. అందరినీ చికిత్స నిమిత్తం మలిహాబాద్ సీహెచ్‌సీకి తరలించారు. ప్రదీప్ కూతురు నేహ(11), కుమారుడు హర్ష్(6) ఉదయం ఊరి బయట ఆడుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. హఠాత్తుగా ఒక నక్క హర్షపై దాడి చేసింది. నక్క అతన్ని చాలా చోట్ల కొరికి నేలపై పడేలా చేసింది. ఇది చూసిన సోదరి నేహా తన సోదరుడిని రక్షించడానికి పరుగెత్తింది. నక్క దవడల నుండి అతనిని విడిపించడానికి పోరాడింది. నక్క ఆమెపై కూడా దాడి చేసింది.
Read Also:Muharram: హైదరాబాద్ లో మొహర్రం ఊరేగింపుకు సర్వం సిద్దం.. ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
శబ్దం విన్న గ్రామానికి చెందిన చాంద్ హసన్ కర్రతో నక్కను వెంబడించడం ప్రారంభించాడు. నక్క అతని చేయి, కాలు కొరికింది. నక్క పరుగెత్తి పొలంలో పని చేస్తున్న మాయాదేవిపై దాడి చేసింది. గ్రామస్తులు గుమిగూడి కర్రలతో నక్కను వెంబడించారు. నక్క పరుగెత్తి తోటకు కాపలాగా ఉన్న అశోక్ (27) చేతిని కొరికి పారిపోయింది. ఆపై సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న పురాయ్పై దాడి చేసింది. నక్కదాడిలో అతడు కిందపడిపోయాడు. గ్రామస్థులు పరుగులు తీసి పురాయ్ ప్రాణాలను కాపాడారు.
Read Also:Filmfare Awards 2024: నానికి డబుల్ ధమాకా.. తెలుగు నామినేషన్స్ లిస్ట్ ఇదే!
సోదరి నేహా (11) తన తమ్ముడు హర్ష్‌పై నక్క దాడికి భయపడలేదు. ఆమె తన సోదరుడిని రక్షించడానికి నక్క వద్దకు చేరుకుంది. నక్క దవడల నుండి భయపడకుండా తన తమ్ముడిని విడిపించుకుంది. తన సోదరుడి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. నేహా ధైర్యాన్ని గ్రామస్తులందరూ అభినందిస్తున్నారు. నేహా ధైర్యం చేసి ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు అంటున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!