విశాఖలో కలకలం రేపుతున్న స్కూల్ విద్యార్ధిని మృతి కేసు కలకలం రేపుతోంది. తల్లీ, అమ్మమ్మలపై అనుమానం వ్యక్తమవుతోంది.. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. తండ్రికి తెలియకుండా చర్చికి తీసుకొచ్చారు. బాలిక పూర్ణ చంద్రిక గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. విజయనగరం జిల్లా డెంకడాకు చెందిన వాళ్లుగా గుర్తించారు.
READ MORE: Pak-India: ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు
జ్ఞానాపురంలోని చర్చిలో జీసస్ బలి పీఠం వద్ద బాలిక మృతి చెందింది. ముఖం చున్నీతో చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్ళు కనిపించాయి. దీంతో పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. కూతురు మృతిపై తల్లి నోరు విప్పడం లేదు. తల్లి, అమ్మమ్మ కంటి నుంచి చుక్క కన్నీరు కూడా కార్చడం లేదు. మృత దేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Pak-India: ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు
