NTV Telugu Site icon

IAS Transfer: తెలంగాణలో 11 సీనియర్ ఐఏఎస్లు బదిలీ..

Ias

Ias

IAS Transfer: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను నియమించారు.

Read Also: Minister Sridhar Babu: ఆరు గ్యారంటీలపై‌ అనుమానాలు వద్దు.. ఆరు నూరైనా అమలు చేస్తాం.

ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌పై వేటు పడింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్‌.. హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌ రెడ్డి.. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి.. మహిళా-శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా ఆర్వీ కర్ణన్.. అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌.. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా.. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్.. రోడ్లు-భవనాలు కార్యదర్శితో పాటు అదనంగా రవాణాశాఖ కార్యదర్శిగా శ్రీనివాస్‌రాజును నియామించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా.. ఎలక్షన్ కమిషన్‌ బదిలీ చేసిన శ్రీనివాస్‌రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు.

Read Also: P Chidambaram: కాంగ్రెస్‌ ఓటమిని ఊహించలేదు: చిదంబరం