NTV Telugu Site icon

Delhi Fire Accident: ఢిల్లీలో పేయింట్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇప్పటి వరకు 11 మంది సజీవదహనం..

Fire Accident

Fire Accident

Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌ ఏరియాలోని ఓ పేయింట్‌ ఫ్యాక్టరీలో గురువారం నాడు సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో 11 మంది కాలిపోయిన మృతదేహాలను అగ్నిమాపక శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Read Also: GSLV F14 Launch: రేపు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 ప్రయోగం.. నేటి మధ్యాహ్నం కౌంట్ డౌన్ స్టార్ట్

కాగా, నిన్న సాయంత్రం 5.25 గంటలకు మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అక్కడికి 22 ఫైరింజన్లతో వెళ్లి మంటలు అదుపులోనికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశామని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారి ఒకరు చెప్పారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు.

Read Also: Autos Strike Today: నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఇక, మృతుల్లో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు అని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో ఉంచిన కెమికల్ డ్రమ్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.. దీంతో లోపల ఉన్న కార్మికులు బయటకు రాలేకపోవడంతోనే మరణించినట్లు చెప్పుకొచ్చారు. ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.