NTV Telugu Site icon

Paper Leak: వికారాబాద్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్!

Paper Leak

Paper Leak

తెలంగాణలో పరీక్ష పేపర్ల లీకు రాయుళ్ల విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. పబ్లీక్ పరీక్షలు అంటే చాలు.. లీకు రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేపరును ముందుగానే లీక్ చేసి.. పరీక్షల కోసం 24 గంటలూ కష్టపడి చదువుతున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఈ లీకులకు అడ్డుకుట్ట మాత్రం వేయడం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ వైపు పరీక్ష కొనసాగుతుండగా.. తాజాగా పేపర్ లీకేజ్ కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రశ్నపత్రం లీకు కలకలం రేపింది.

Also Read : Balagam: అద్భుతాలు సృష్టించడం ఇంకా ఆగలేదు… మన సినిమాకి మరో గౌరవం

నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీక్ వంటి ఘటనలు జరుగకుండా చాలా జాగ్రత్తులు తీసుకున్నారు. అయినా టెన్త్ ఎక్సమ్ పేపర్ లీక్ కావడం చర్చనీయంశంగా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది.

Also Read : కడుపు ఉబ్బరంగా ఉందా.. తగ్గాలంటే ఇలా చేయండి..

పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. 9 గంటల 37 నిమిషాలకే ప్రశ్నపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. అయితే ఈ ప్రశ్నపత్రం తాండూరులోని ఓ పరీక్ష కేంద్రం నుంచి లీకైనట్లు సమాచారం. అయితే పేపర్ లీకైనట్లు వస్తున్న వార్తలపై వికారాబాద్ డీఈవో స్పందించారు. తమ జిల్లాలో పేపర్ లీక్ కాలేందంటూ వివరణ ఇచ్చారు. అయితే ప్రశ్నపత్రం లీక్ వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ఏర్పడింది. తాండూరు నంబర్ వన్ స్కూల్ లో బందెప్ప అనే టీచర్ ఉదయం 9.37 నిమిషాలకు త ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఫోటో ఎన్ని గంటలకు తీశారు ? పరీక్ష కంటే ముందే ఫోటో తీసి ఎవరికైనా ఇచ్చారా ?అని పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు బందెప్ప ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తాండూర్ లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కలకలం నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో డీఈఓ రేణుకా దేవి సమావేశమయ్యారు.