Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. వీడియో ఇదిగో..!

Agarbatti

Agarbatti

గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్‌బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా.. ఈ బాహుబలి బత్తీ తయారు చేయటానికి రెండు నెలల సమయం పట్టిందని.. దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు.

Ayodhya Ram Temple Invitation : అయోధ్య రామ మందిరం ఆహ్వాన కిట్ లో ఏమున్నాయంటే?

ఈ అగర్‌బత్తి ఒక నెల, నెలన్నర వరకు వెలుగుతుంది. అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ తదితర వాటిని ఉపయోగించారు. ఈ అగర్‌బత్తి మొత్తం బరువు 3,400 కిలోలు. గ్రామస్థులు మొత్తం ఈ అగర్‌బత్తి తయారీలో పాలుపంచుకున్నారు. అయోధ్య చేరిన ఈ అగర్‌బత్తిని మంగళవారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ సమక్షంలో ముట్టించారు. పలువురు ఆలయ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు.

PM Modi: లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు..

కాగా.. జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రామ మందిర మహాసమారోహే ప్రాణ స్థాపనలో దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. పండుగతో పాటు.. వివిధ సాంస్కృతిక, పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి. యేళ్లతరబడి ఎదురుచూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దేశ, విదేశాల్లో ఉన్న రామ భక్తులు తమకు తోచిన రీతిలో ఉడతాసాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు.

Exit mobile version