NTV Telugu Site icon

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు

Vizag Steel Plant

Vizag Steel Plant

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు ఇవాళ్టికి 1000 రోజులకు చేరుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ను 100 శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉక్కు కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రకాలుగా నిరసనలు నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దిగ్భందించారు.

Read Also: Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

ఇప్పటికే పలు సార్లు కార్మికులు స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనంతో పాటు గేట్లను ముట్టడి చేశారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్‌లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని చెప్పడంతో.. అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్‌, లీగల్‌ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన వారు మద్దతిస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ దీక్షలు ప్రారంభించి నేటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ వివిధ రూపాల్లో ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నారు.

Read Also: Raja Singh: మోడీ సభకు రాజాసింగ్ డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే

ఇక, దీక్షలు ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా నేడు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. అదే విధంగా కాలేజీలు, స్కూల్స్ బంద్‌ చేయాలని ఉక్కు పోరాట కమిటీ నేతలు కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరం దగ్గరకు స్టీల్ కార్మిక సంఘ నేతలు ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.