పశ్చిమ బెంగాల్ లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. మోండర్ కారు నడపడానికి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అవసరం లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో నడుస్తుందని కారు యాజమాని తెలిపాడు. అయితే ఈ కారుకు అయ్యే ఇందన ఖర్చు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రూ 30 నుంచి రూ. 35 లతో 100 కిలోమీటర్లు నడుస్తోంది. అంటే కిలోమీటర్ కు 80 పైసలు. పెట్రోల్,డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో నడిచేలా మోండల్ నానో సోలార్ కార్ ఇప్పుడు అక్కడ సూపర్ పాపులర్ అయింది.
Also Read : Srinidhi Shetty: ‘కెజిఎఫ్’ సెట్ లో యష్ నన్ను వేధించాడు.. పచ్చి అబద్దం
అయితే ఈ సోలార్ కారులో గేర్ సిస్టమ్ ఉంది. కానీ ఇంజిన్ లేదు.. ఇది నడుపుతున్నప్పుడు అసలు శబ్దం రాదు.. నాల్గవ గేర్ లో ఇది గంటకు 80 కిలోమీటర్లు వెళ్తుంది. మోండల్ చేసిన తయారు ఈ సోలార్ కారు సౌరశక్తిలో ఆవిష్కరణల దిశగా దిశానిర్ధేశం చేయడమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ కారును రూపొందించేటప్పుడు మోండల్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ పట్టు వదల్లేదు.. కొత్తగా ఏదైనా చేయాలనే అతని చిన్ననాటి కలను ఈ కారు ద్వారా నిజం చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న ఇందన ధరలతో ఇలాంటి వెహికిల్స్ రావడంతో సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : IND vs AUS : హర్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ టాస్క్.. సిరీస్ పై ఇరు జట్లు నజర్