మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మయన్మార్ సరిహద్దులోని న్యూ సమతాల్ గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో సమాచారాన్ని పంచుకుంటూ.. భారత సైన్యం తూర్పు కమాండ్ మే 14న, స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని ఖెంగ్‌జోయ్ తహసీల్‌లోని న్యూ సమతాల్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ యూనిట్ ఈ ఆపరేషన్‌ను ప్రారంభించిందని తెలిపింది. ఈ ప్రాంతం భారతదేశం-మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఇది తరచుగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది.
Also Read:Off The Record : తెలంగాణ కాంగ్రెస్ పదవుల పంపకాలపై గందరగోళం
ఆపరేషన్ సమయంలో సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు, ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారు. ప్రతీకారంగా సైనికులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాక్కునే అవకాశం ఉన్నందున, గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య భద్రతా దళాలు ఈ చర్యను ఒక ముఖ్యమైన విజయంగా భావిస్తున్నాయి.
Acting on specific intelligence on movement of armed cadres nearby New Samtal village, Khengjoy Tehsil, #Chandel District near the #Indo_MyanmarBorder, #AssamRifles unit under #SpearCorps launched an operation on 14 May 2025.
During the operation,… pic.twitter.com/KLgyuRSg11
— EasternCommand_IA (@easterncomd) May 14, 2025
