అస్సాంలో 10 నెలల చిన్నారిలో ‘హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్’ (HMPV) ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలో ఇది మొదటి కేసు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సిజనల్ వ్యాధులతో నాలుగు రోజుల క్రితం చిన్నారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినట్లు ఏఎంసిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ధృబజ్యోతి భూయాన్ వెల్లడించారు. ICMR-RMRC నుంచి వచ్చిన పరీక్ష రిపోర్టులో హెచ్‌ఎమ్‌పీవీ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లుఎంజా, ఫ్లూ సంబంధిత కేసులలో పరీక్షల కోసం అన్ని శాంపిల్స్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (AIIMS)కి క్రమం తప్పకుండా పంపుతున్నట్లు తెలిపారు.
READ MORE: Siddipet: ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు
ఇదిలా ఉండగా.. శీతాకాలంలో మార్పులు చోటుచేసుకున్న కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తేల్చింది. భారత్‌లోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్‌ఎస్‌ఏ, హెచ్‌ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు డీజీహెచ్ఎస్ చెప్పుకొచ్చింది.
READ MORE: Dil Raju: తెలంగాణ ప్రజానికానికి దిల్‌రాజు క్షమాపణలు..