Site icon NTV Telugu

Gym Roof Collapse: కూలిపోయిన జిమ్‌ పైకప్పు.. 10 మంది దుర్మరణం

Gym Roof Collapse

Gym Roof Collapse

Gym Roof Collapse: ఈశాన్య చైనాలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో 10 మంది మరణించగా, ఒకరు చిక్కుకుపోయారని రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని నెం. 34 మిడిల్ స్కూల్‌లోని జిమ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పకూలిందని తెలిసింది. సోమవారం ఉదయం 5:30 నాటికి, శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Facebook Love: ఫేస్‌బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ

సీసీటీవీ ద్వారా ప్రసారం చేయబడిన ఫుటేజీలో మొత్తం పైకప్పు జిమ్‌పై కూలిపోయిందని, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తు్న్నట్లు కనిపించింది. దాదాపు 160 అగ్నిమాపక సిబ్బంది, 39 అగ్నిమాపక ట్రక్కులతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నిర్మాణ సంస్థకు బాధ్యత వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరిగా అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణం. 2015లో టియాంజిన్‌లో ఇలాంటి ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడులో కనీసం 165 మంది మరణించారు.

Exit mobile version