Site icon NTV Telugu

Coronavirus: విశాఖలో కరోనా కలకలం.. అధికారుల హెచ్చరికలు

Vizag

Vizag

Coronavirus: విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో.. ఈ సీజన్‌లో కరోనా భారినపడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిశంబర్ రెండోవారంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. డిశంబర్ 24న కంచరపాలెంకు చెందిన సోమకళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన తర్వాత పరీక్షిస్తే కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులకు స్క్రీనింగ్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అనుమానిత లక్షణాలతో ఈ సీజన్లో జరిగిన తొలి మరణం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టెస్టులు సంఖ్యను పెంచింది.

Read Also: New Year 2024: న్యూయర్ రోజు భారీగా పెరిగిన కండోమ్ ఆర్డర్లు.. గంటకు అన్ని వేల ఆర్డర్లా?

ఇక, సీజనల్ వ్యాధులతో పాటు కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. జనవరి నెలలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు, సమూహాలుగా వేడుకల్లో పాల్గొవడం వల్ల కోవిడ్ బాధితులు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని.. కోవిడ్ బారిన పడకుండా.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నారు అధికారులు.

Exit mobile version