SS రాజమౌళి : స్టూడెంట్ నెం.1 తో స్టార్ట్ చేసిన జర్నీ “ట్రిపుల్ ఆర్” దాకా సరిగ్గా 12 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేదు. బాహుబలి 1,2 & RRR తో టాలీవుడ్‌ని పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లిన ఫస్ట్ డైరెక్టర్ జక్కన్న. RRR తర్వాత అయితే ఇండియా కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కు తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు రాజమౌళి సినిమాకి రూ. 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ని ఎప్పుడో దాటి వచ్చాడు! బాహుబలి 2 ఏకంగా రూ. 1800Cr వసూళ్లు సాధించి చూపాడు. RRR రూ. రూ. 550Cr బడ్జెట్ పెడితే రూ. 1400Cr వసూళ్లు రాబట్టిన స్ట్రాటజీ ఆయనది. ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త అడ్వెంచర్ మహేశ్ బాబుతో చేస్తున్నాడు.. ఈసారి కూడా రిస్కీ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. బడ్జెట్ రూ.1000 కోట్లకు పైగా గోల్ రూ. 2500 కోట్లకు కలెక్షన్స్ కు గురి పెట్టాడు.
అనిల్ రావి పూడి : లో బడ్జెట్ తో ఎంటర్ టైన్మెంట్ మూవీస్ చేస్తున్న అనిల్ రావి పూడి ఇప్పటి కే 8 సినిమాలు చేసి 0 ఫ్లాప్స్ తో సక్సెస్ జర్నీ చేస్తున్నాడు రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో వచ్చి రీజన్ లాంగ్వేజ్ లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి మార్కెట్ స్పాన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 157 సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హై బడ్జెట్ లో చేస్తున్నట్టు సమాచారం.
సందీప్ వంగా : స్ట్రాటజీ అర్జున్ రెడ్డికి రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టి రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ ఆఫర్ కొట్టేశాడు. అర్జున్ రెడ్డినే కబీర్ సింగ్ గా మార్చి అక్కడా సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత రూ. 38 కోట్ల బడ్జెట్ తో యానిమల్ చేసి, ఏకంగా రూ. 380 కోట్లు కొల్ల గొట్టిన హిస్టరీ సందీప్ వంగాకుంది. క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ, పీక్స్ ఎమోషన్ ఎస్టాబ్లిష్ చేసి, కంటెంట్ తోనే కన్వే చేయడం సందీప్ వంగా స్టయిల్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్, రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చేయబోతున్నాడు.. తర్వాత అల్లు అర్జున్ తో ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాల కంబైన్డ్ బడ్జెట్ కూడా దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుంది.
సో ఇప్పుడు హై బడ్జెట్ ప్రెజర్ ఉంది. ప్రెజర్ తట్టుకుని హిట్ కొట్టడం, ట్రాక్ రికార్డ్ కాపాడుకోవడం 0 ఫ్లాప్ డైరెక్టర్స్ కి కత్తిమీద సామే అన్నట్టు తయారైంది సిచ్యుయేషన్.
