ఇప్పటికే ఇండియాలో మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఈ మూడు వ్యాక్సిన్లు 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తున్నారు. కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరో మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దేశీయంగా తయారైన జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన జైకోవ్ డి ఒకటి కాగా, కోవాక్స్, స్పుత్నిక్ వీ లైట్ టీకాలు మిగిలినవి. అయితే, ఇందులో జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్ డి టీకాకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. 12 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ను అందించవచ్చు. ఇది మూడు డోసుల వ్యాక్సిన్ కావడంతో అత్యధిక కాలంపాటు రక్షణ ఉండే అవకాశం ఉన్నది. జైకోవ్ డి వ్యాక్సిన్ కు అనుమతులు లభించడంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నది.
Read: ప్రపంచ దోమల దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
