Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పర్యాటకుడు రిషి భట్ జిప్ లైన్ పై వేలాడు తీసుకున్న వీడియోలో.. బైసరన్ లోయను తమ ఆధీనంలోకి ఉగ్రవాదులు తీసుకుంటున్న విజువల్స్ ను అందులో చూపించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన సమయంలో తాను జిప్ లైన్‌లో ఉన్నానని తెలిపాడు.. ఆ వీడియోలో, నా వెనుక ఉన్న ఒక వ్యక్తి ‘అల్లాహు అక్బర్’ అని అరుస్తున్నట్లు మీరు చూడవచ్చు.. ఆ వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాడు.
Read Also: High Court: గ్రూప్-1 పిటిషనర్లకు జరిమానా విధించిన హైకోర్టు..
అయితే, తాను జిప్‌లైన్‌లోకి రాకముందే, తన భార్య, కొడుకు, మరో నలుగురు ముందుకు వెళ్లిపోయారు.. అప్పుడు నా భార్య పక్కనే మరో రెండు జంటలు ఉండే.. ఓ ఉగ్రవాది వచ్చి, వారి పేర్లు, మతం అడిగి, ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపాడు.. నేను రోప్‌వేలో ఉన్నందున, నా ప్రాణాలు రక్షించుకోగలిగాను.. నేను నా భార్యతో ఉండి ఉంటే ఇప్పటికే చనిపోయి ఉండే వాడినని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ టెర్రరిస్టు అక్కడ నుంచి వెళ్లిపోయిన వెంటనే.. నేను నా జిప్‌లైన్ తాడును ఆపి, దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి క్రిందికి దూకి, నా భార్య- కొడుకుతో అక్కడ నుంచి పారిపోయాను అని టూరిస్టు రిషి భట్ తెలిపాడు. అప్పుడు, నేను నా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడం గురించి మాత్రమే ఆలోచించానని పేర్కొన్నారు. ఆ కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయని వెల్లడించాడు.
Read Also: KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కు గాయం.. బెడ్ రెస్ట్ సూచించిన వైద్యులు
ఇక, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు భద్రతా దళాల మాదిరిగా దుస్తులు ధరించారు అని పర్యటనకుడు రిషి భట్ తెలిపాడు. నేను పరిగెడుతున్నప్పుడు, ఇద్దరు భద్రతా దళాలను కాల్చి చంపడం చూశా.. వారి దగ్గర నుంచి ఉగ్రవాదులు యూనిఫాంలను దొంగిలించారని నేను అనుకుంటున్నాను.. ఈ కాల్పులు ప్రారంభమైనప్పుడు, స్థానికులు ఎవరూ సంఘటన స్థలంలో లేరని అన్నారు. కానీ, నేను అడవిలోకి పారిపోయిన 18 నిమిషాల్లోనే, భారత సైన్యం వచ్చి మమ్మల్ని రక్షించిందని వెల్లడించారు.
